బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. BEL లో ఇంజినీర్ పోస్టులు..
బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్. నవరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్(మెకానికల్), ప్రొబేషనరీ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీకోసం..
కేంద్రప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 350 ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 31లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు
ప్రొబేషనరీ ఇంజినీర్(మెకానికల్) గ్రేడ్ 2 - 200 పోస్టులు
ప్రొబేషనరీ ఇంజినీర్(ఎలక్ట్రికల్) గ్రేడ్ 2- 150 పోస్టులు
విద్యార్హతలు
అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆయా ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు అనుగుణంగా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీఈ, బీటెక్ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీటెక్ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే జాయినింగ్ సమయంలో డిగ్రీ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
వయోపరిమితి
ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి గరిష్ఠంగా 25 ఏళ్లకు మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంది. దివ్యాంగులకు 10సంవత్సరాల వయోపరిమితి ఉంది.
దరఖాస్తు ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1180 చెల్లించాలి
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి పరీక్ష రుసుము లేదు.
ఎంపిక విధానం
అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1:5 విధానంలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ మార్కులు 15. అందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 - రూ.1,40,000 వరకు జీతభత్యాలు ఉంటాయి. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ రీయంబర్స్మెంట్ సహా పలు బెనిఫిట్స్ లభిస్తాయి.
దరఖాస్తు విధానం
ఆసక్తిగల అభ్యర్థులు BEL అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2025 జనవరి 31
కంప్యూటర్ ఎగ్జామ్ : 2025 మార్చిలో జరగవచ్చు.












Click it and Unblock the Notifications