B.ED చేశారా.. అయితే ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: పూర్తి వివరాలు..!!

ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీలో పలు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ గ్రేడ్-II,టీజీటీ మరియు కేర్‌టేకర్ లేదా వార్డెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవన్నీ కూడా ఎస్సీ / ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు . ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

ముందుగా ఏపీలో నాలుగు జోన్లకు సంబంధించి ప్రిన్సిపల్ పోస్టు 1 ఉండగా అది కూడా ఎస్సీ కేటగిరీలో ఉంది. ఇక ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల సంఖ్య విషయానికొస్తే 1వ జోన్‌లో 3 ఎస్సీ పోస్టులు ఒక ఎస్టీకి పోస్టును కేటాయించారు. 2వ జోన్‌లో 2 పోస్టులు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించగా 6 పోస్టులు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. ఇక 3వ జోన్‌లో 6 పోస్టులు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించగా 7 పోస్టులు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించారు. 4వ జోన్‌లో 6 పోస్టులు ఎస్సీ వర్గానికి 7 పోస్టులు ఎస్టీ వర్గానికి కేటాయించారు. దీంతో మొత్తం టీజీటీ పోస్టులు ఎస్సీలకు 17 ఎస్టీలకు 21గా కేటాయించారు. ఇక కేర్‌టేకర్ లేదా వార్డెన్ పోస్టుల విషయానికొస్తే మొత్తం 7 పోస్టులు కేటాయించారు. ఇందులో 1 నుంచి 4వ జోన్ల వరకు ఒక్కో జోన్‌లో 1 పోస్టు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించగా.. ఎస్టీ సామాజిక వర్గానికి వస్తే 1వ జోన్‌లో 2పోస్టులు 2వ జోన్‌లో 1 పోస్టును భర్తీ చేయనున్నారు.

APSWREIS Recruitment 2021:Apply for Principal TGT and Caretaker jobs

విద్యార్హత వివరాలు ఇలా ఉన్నాయి:

ప్రిన్సిపల్ గ్రేడ్-II: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పీజీలో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక బీఈడీలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10 ఏళ్ల పాటు బోధనా అనుభవం. ఇందులో మూడేళ్ల పాటు పీజీటీగా లేదా జూనియర్ లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా మూడేళ్ల పాటు పాలనాపరమైన అనుభవం ఉండాలి. అంటే ఏదైనా హైస్కూలులో హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్‌గా చేసి ఉండాలి.

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 55శాతం మార్కులతో పోస్టుగ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణత.బీఈడీ డిగ్రీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పేపర్‌-IIలో ఉత్తీర్ణులై ఉండాలి.

కేర్ టేకర్ / వార్డెన్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి.

ఇక అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 16 ఆగష్టు 2021. దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలి: www.jnanabhumi.ap.gov.in

అప్లికేషన్ ఫీజు: రూ.500. ఇది కూడా ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించొచ్చు.

వేతనం:

ప్రిన్సిపల్ గ్రేడ్-II: 40,270 - 93,780

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: 28,940 - 78,910

కేర్ టేకర్ / వార్డెన్: 21,230 - 63,010

ఇక నోటిఫికేన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+