ఏపీలో ఇంజినీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ లోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం APEAPCET 2025 నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగానే కౌన్సెలింగ్ ప్రక్రియలో ఇంజినీరింగ్ విభాగంలో మొదటి విడత సీట్ల కేటాయింపు జాబితా అధికారికంగా విడుదలైంది.
కాగా షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ జూలై 16న జరగాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల ప్రాసెసింగ్ ఆలస్యమవడంతో ఈరోజు (జూలై 17, 2025 )న విడుదల చేశారు. సీట్ల కేటాయింపు ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఎలా చెక్ చేసుకోసుకోవాలంటే.. ?
- అధికారిక వెబ్‌సైట్: https://eapcet-sche.aptonline.in/EAPCET/
- హోమ్‌పేజీలో "Download Allotment Order" అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్‌టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది - దాన్ని ఎంటర్ చేయాలి.
- తర్వాత మీ Allotment Order, Self-Reporting Letter, Web Options Report వంటి డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రిపోర్టింగ్ కోసం అవసరమైన పత్రాలు ఇవే..
కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయడానికి విద్యార్థులు ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- APEAPCET కౌన్సెలింగ్ ఆన్‌లైన్ స్లిప్
- APEAPCET ర్యాంక్ కార్డు
- APEAPCET అడ్మిట్ కార్డు
- 10వ తరగతి మెమో (SSC/Equivalent)
- 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం / లోకల్ స్టేటస్ సర్టిఫికెట్
- కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ సర్టిఫికెట్లు (SC/ST/BC/EWS/PWD/NCC/Sports/Ex-servicemen ఉంటే) తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు..
- జూలై 26, 2025 లోపు - కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
- ఆగస్టు 4, 2025 నుండి - తరగతులు ప్రారంభం అవుతాయి.
- తదుపరి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది.
మరోవైపు ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్‌లో కూడా మొత్తంగా 145 కేంద్రాలలో నిర్వహించారు. దాదాపు 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారని వెల్లడించారు. మే 19 నుంచి 20వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించగా.. 75,460 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 67,761మంది (89.80శాతం) అర్హత సాధించారు. అలాగే, మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి 10 సెషన్లలో జరిగిన పరీక్షకు 2,64,840 మంది విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో 1,89,748మంది (71.65శాతం) అర్హత సాధించారు.












Click it and Unblock the Notifications