ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నత విద్య మండలి నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఏకంగా 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు ఎంట్రాన్స్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి బుధవారం ప్రకటించింది. ఈఏపీ సెట్ ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ (TG EAPCET 2025) జరగనుంది. ఈఏపీ సెట్ పరీక్షను జేఎన్టీయూ నిర్వహించనుండగా.. ప్రొఫెసర్ బీ డీన్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించి ఈ సెట్ మే 12న జరగనుంది.

ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహరిస్తారు. బీఈడీ ప్రవేశాల కోసం జూన్ 1న ఎడ్ సెట్ జరగనుంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహంచే ఎడ్ సెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ బీ వెంకట్రామిరెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 1వరకు పీజీ సెట్ నిర్వించనున్నారు. జేఎస్టీయూ హైదరాబాద్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ అరుణ కుమారిని నియమించారు వ్యాయమ విద్య కోర్సులు డీపెడ్, బీపెడ్‌ల్లో ప్రవేశాల కోసం జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ నిర్వహిస్తారు. పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ వ్యవహరించనున్నారు.
ఎల్ఎల్బీ, ప్రవేశాల కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించి, కన్వీనర్ గా ప్రొఫెసర్ బీ విజయలక్ష్మిని నియమించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది. ఐసెట్‌ను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుండగా.. ప్రొఫెసర్ లువాల రవీ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. పీఈసెట్ మినహా మిగితా ఎంట్రన్స్‌లన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.
పరీక్షలు, వాటి తేదీలు
అగ్రికల్చర్ ఏప్రిల్ 29
ఫార్మసీ ఏప్రిల్30
ఈసెట్ మే 12
ఎడ్‌సెట్ జూన్ 1
లాసెట్, పీజీ లాసెట్ జూన్ 6
ఐసెట్ జూన్ 8, 9
పీజీఈసెట్ జూన్ 16 నుంచి 19 వరకు












Click it and Unblock the Notifications