సివిల్స్ లో కొత్త రూల్స్.. ఆ సర్టిఫికెట్స్ ఉండాల్సిందే..!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సివిల్స్ అప్లై చేసుకునే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేసింది. అంతకుముందు ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తమ వయసు, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించేవాళ్లు. ఆ సమయంలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా యూపీఎస్సీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
పరీక్షావిధానం ఇదే
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో మొత్తం మూడు సర్వీస్ లు ఉంటాయి. వీటిని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. అవి.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్). ఇక పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి.

ఈ సర్టిఫికెట్స్ ఉండాల్సిందే..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రూల్స్-2025 ప్రకారం.. అప్లికేషన్లో పుట్టిన తేదీ, కులం లేదా వర్గం (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్ వివరాలను కచ్చితంగా పేర్కొనాలి. అలాగే వాటిని రుజువు చేసే పత్రాలను అప్లోడ్ చేయాల్సిఉంటుంది. ఒకవేళ దరఖాస్తుతోపాటు ఈ పత్రాలు సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.'
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య :1129
ఐఏఎస్ పోస్టుల సంఖ్య: 979
ఐఎఫ్ఎస్ పోస్టుల సంఖ్య : 150
అప్లికేషన్ తేదీలు..
అప్లికేషన్ ప్రారంభం: 22/01/2025
అప్లికేషన్ చివరి తేదీ: 11/02/2025
అప్లికేషన్ ఎడిట్ టైమ్: ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు
ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. హాల్ టికెట్లు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 100 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
వయోపరిమితి
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు కనీస వయసు 21 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 32 గా ఉంది.












Click it and Unblock the Notifications