పరీక్ష లేకుండానే రూ. లక్ష జీతంతో జాబ్స్.. మిస్ కావొద్దు
ప్రతిష్టాత్మక ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 270 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. మరి మీరు కూడా అప్లై చేసుకోండి.
ఇండియన్ నేవీలోలోని షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) 270 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అంతేకాక పెళ్లికాని మహిళలు, పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు : 270, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 60, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 22, పైలట్ 26 ఖాళీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో 15 ఖాళీలు ఉన్నాయి. ఇంజినీరింగ్ 38, ఎలక్ట్రికల్ 45, నేవల్ కన్‌స్ట్రక్టర్ విభాగంలో 18 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అర్హత: బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: వయోపరిమితి ఆయా పోస్టులను బట్టి మారుతుంది.జనవరి 2, 2001/2002 - జనవరి 1, 2005/2006/2007 మధ్య జన్మించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఎంపిక విధానం పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎలాంటి రాతపరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలు బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతాలో జరుగుతాయి.
అప్లికేషన్ ప్రారంభం : ఫిబ్రవరి 13న ప్రారంభం
అప్లికేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 25












Click it and Unblock the Notifications