నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర వైద్య విద్య విభాగం (DME) కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ ప్రకటన విడుదలైంది. మొత్తం 22 విభాగాల్లో 284 పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఎంఈ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఈ నియామకాలు జరగనున్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు..

ఈ నోటిఫికేషన్‌లో అనేక విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అనాటమీ (29), ఫిజియాలజీ (22), బయోకెమిస్ట్రీ (33), ఫార్మకాలజీ (28), పాథాలజీ (32), మైక్రోబయాలజీ (30) వంటి ప్రీ-క్లినికల్, పారా-క్లినికల్ విభాగాల్లో గణనీయమైన పోస్టులు ఉన్నాయి.

అలాగే కమ్యూనిటీ మెడిసిన్ (24), ఫోరెన్సిక్ మెడిసిన్ (18), ఎమర్జెన్సీ మెడిసిన్ (34) వంటి విభాగాల్లో కూడా భారీగా ఖాళీలు ప్రకటించారు.

క్లినికల్ విభాగాల్లో పీడియాట్రిక్స్ (2), జనరల్ సర్జరీ (4), ఆర్థోపెడిక్స్ (2), ఓబీజీ (2), అనెస్తీషియాలజీ (3), రేడియో డయాగ్నోసిస్ (4), డీవీఎల్ (1), సైకియాట్రీ (1), ఈఎన్‌టీ (1), ఆప్తమాలజీ (1) పోస్టులు ఉన్నాయి.

jobs-in-andhra-pradesh-department-of-medical-education-released-a-notification-for-284-posts

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో MD, MS లేదా DNB పూర్తి చేసి ఉండాలి. అదనంగా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి. అవసరమైతే ఇంటర్న్‌షిప్ పూర్తి సర్టిఫికేట్, ప్రొవిజనల్/పర్మనెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలను సరిగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వయోపరిమితి & రిజర్వేషన్..

వయోపరిమితి విషయానికి వస్తే, క్లినికల్ విభాగాలకు గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు, నాన్-క్లినికల్ విభాగాలకు 49 సంవత్సరాలు గా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు ఉండే అవకాశం ఉంది. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ నియామకాలలో ప్రత్యేకతగా చెప్పొచ్చు.

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు మార్చి 25, 2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 29, 2026గా నిర్ణయించారు. తక్కువ సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ముందుగానే అప్లై చేయాలని సూచిస్తున్నారు. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అనుభవ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. తప్పులుంటే అభ్యర్థిత్వం రద్దు అయ్యే అవకాశం ఉంది.

దరఖాస్తు రుసుము..

దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులకు రూ.2000గా నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ పూర్తి చేసిన తర్వాతే దరఖాస్తు సమర్పణ పూర్తవుతుంది.

ఎంపిక విధానం & జీతం..

ఈ నియామకాలకు రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పీజీ డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రిజర్వేషన్ నిబంధనలు కూడా పాటించబడతాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.80,500 వరకు జీతం చెల్లించనున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+