రాతపరీక్ష లేకుండానే నెలకు రూ. లక్షకు పైనే జీతంతో.. ఏపీ ట్రాన్‌కోలో ఉద్యోగాలు..
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కార్పొరేట్ లాయర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్‌కో ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల (డిసెంబర్) 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టుల అర్హతలు, పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
ఆంధ్రప్రదేశ్ ట్రాన్‌కో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కార్పొరేట్ లాయర్ ఖాళీల భర్తీకి ప్రకటనను వెలువరించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు 5. ఈ పోస్టులకు మూడు సంవత్సరాల ఎల్ఎల్‌బీ లేదా ఎల్ఎల్ఎం లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లాకోర్సు ఉత్తీర్ణతతో పాటు నాలుగు సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారికి నెలకు రూ. 1,20,000 జీతం ఉంటుంది.

పూర్తి వివరాలివే..
కార్పొరేట్ లాయర్ : మొత్తంపోస్టులు 05
విద్యార్హతలు : మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ఉత్తీర్ణతతో పాటు నాలుగేళ్ల ఎక్స్‌పిరియన్స్ ఉండాలి. ఈ పోస్టులకు ఎటువంటి వయోపరిమితి లేదు.
వేతనం : నెలకు రూ.1,20,000.
ఎంపిక చేయు విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఇదే..
ఆఫ్‌లైన్ దరఖాస్తులు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 21 రోజులలోపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ: 19.11.2024












Click it and Unblock the Notifications