Education: ఉద్యోగావకాశాలపై కర్ణాటక నెవ్వర్ బిఫోర్ డెసిషన్.. 100 కార్పొరేట్ కంపెనీలతో..
Corporate adoption: దేశంలో ఉపాధి కల్పనతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాను పెంచేందుకు ప్రధాని మోదీ ఇటీవల ఓ పథకాన్ని ప్రకటించారు. కార్పొరేట్ కంపెనీలు గ్రాడ్యుయేట్లకు ట్రైనీలుగా అవకాశం కల్పించి, వారి CSR ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని జీతాలుగా ఇచ్చేలా కేంద్రం రూపకల్పన చేసింది. కర్ణాటక ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. తమ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని 100 ఇంజినీరింగ్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నాటికి నూరు కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకునేలా చేయాలని కర్ణాటక యోచిస్తోంది. ఇటీవల ముగిసిన మూడు రోజుల బెంగళూరు టెక్ సమ్మిట్ (BTS)లో ఈ నిర్ణయాన్ని సర్కారు వెల్లడిచింది. కర్ణాటక సమాచార సాంకేతిక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

'రాష్ట్రంలో ఎంతోమంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తగిన శిక్షణ లేకపోవడంపై పరిశ్రమ ఆందోళనలను ఈ చొరవ పరిష్కరిస్తుందనుకుంటున్నాం. నైపుణ్య అంతరాన్ని తగ్గించడానికి, కార్పొరేట్లు కళాశాలలను దత్తత తీసుకుని ప్రత్యేక శిక్షణను అందించే సహకార నమూనాను ప్రభుత్వం ప్రతిపాదించింది. వారికి శిక్షణ ఇవ్వంలో పరిశ్రమలు చురుకైన పాత్ర పోషిస్తాయని మేము భావిస్తున్నాము' అని ఖర్గే వివరించారు.
సాంకేతికత మరియు ఆవిష్కరణలలో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కర్నాటక తన రోడ్‌మ్యాప్‌ను కూడా ఈ సమ్మిట్‌లో ప్రదర్శించింది. పలు ప్రముఖ ఆటోమొబైల్ తరహా పరిశ్రమల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ చొరవ తీసుకున్నట్లు ప్రియాంక్ తెలిపారు. IBM, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాక్సెంచర్ మరియు BFSI వంటి దిగ్గజాల సహకారంతో ఈ తరహా కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
గ్లోబల్ మార్కెట్‌ల తరహాలో అభివృద్ధి చెందడానికి, అధునాతన సామర్థ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం ద్వారా ఏడాదిలోపు 1 లక్ష మంది వ్యక్తులకు నైపుణ్య శిక్షణ కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన ప్రకటిచారు. కన్నడిగులు ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన మరియు ఉపాధి కల్పించగల శ్రామిక శక్తిగా ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
సమ్మిట్ సందర్భంగా కర్ణాటక రక్షణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసినట్లు ప్రియాంక్ చెప్పారు. ఫిన్లాండ్ మరియు స్విట్జర్లాండ్‌లతో కూడా అదనపు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లు మరియు ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయడానికి ఇవి వీలు కల్పిస్తాయని తెలిపారు.












Click it and Unblock the Notifications