East Godavari జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు: మంచి జీతం-పోస్టులేంటి..అర్హతలు ఇలా..!!
తూర్పుగోదావరి జిల్లాలోని ఆరోగ్య రంగంలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా డీఎంహెచ్‌ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందుో భాగంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ కింద నేషనల్ అర్బర్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది. ఇంతకీ ఏ పోస్టులు భర్తీ చేయనున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. చివరి తేదీ ఏంటి, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకుందాం.
తూర్పుగోదావరి జిల్లా ఆరోగ్య రంగంలో నేషనల్ అర్బర్ హెల్త్ మిషన్ కింద పలు పోస్టులు భర్తీ చేసేందుకు డీఎంహెచ్‌ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 77 స్టాఫ్ నర్సుల పోస్టులు, 13 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 17 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు,17 లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 124 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం ఇలా ఉన్నాయి.

స్టాఫ్ నర్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఇంటర్మీడియల్ మరియు జనరల్ నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీ కోర్సును పూర్తి చేసి ఉండాలి. లేదా బీఎస్సీ/ఎమ్మెస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో ఇంటర్మీడియెట్+డిప్లొమా లేదా డిగ్రీ లేదా మాస్టర్స్ చేసి ఉండాలి.ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పీజీడీసీఏ డిగ్రీ అయిన ఉండాలి. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఏదైనా ప్రభుత్వ అధీనంలో నడిచే సంస్థలో ఉన్న హాస్పిటల్‌లో రెండేళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్థులు 10వ తరగతి మార్కులిస్టు, ఇంటర్మీడియెట్ సర్టిఫికేట్, విద్యార్హతలు, టెక్నికల్ అర్హతల సర్టిఫికేట్, నాల్గవ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, ఎస్సీ/ఎస్టీ/బీసీ సర్టిఫికేట్, దివ్యాంగులైతే పీహెచ్ సర్టిఫికేట్‌లు గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించి మీ పూర్తి వివరాలు ఉన్న అప్లికేషన్ ఫారంను కాకినాడ డీఎంహెచ్‌ఓలో అందజేయాలి. ఇందుకు చివరి తేదీ 2021 సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇవ్వడం జరిగింది.
వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టు చేసిన జాబితాను 2021 అక్టోబర్ 5వ తేదీన ప్రదర్శిస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలెక్షన్ జాబితాను 8 అక్టోబర్‌న విడుదల చేస్తారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్లు 11 అక్టోబర్‌న ఎంపికైన అభ్యర్థులకు అందజేస్తారు. ఇక పూర్తి వివరాలకు అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications