విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్
నిరుద్యోగులకు శుభవార్త. విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. సబ్ స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పురుషులు, మహిళా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ తోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏప్రిల్ 1 లోపు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం పోస్టులు: 389.. సైంటిఫిక్ అసిస్టెంట్-బీ(45 పోస్టులు), సైంటిఫిక్ అసిస్టెంట్- కేటగిరీ 1(82), టెక్నీషియన్- కేటగిరీ 2(226), అసిస్టెంట్ గ్రేడ్-1(hr)(22 పోస్టులు), అసిస్టెంట్ గ్రేడ్-1(f&a)(4 పోస్టులు), అసిస్టెంట్ గ్రేడ్-1(c&mm)(10పోస్టులు), నర్సు(1 పోస్టులు)
విద్యార్హత: సైంటిఫిక్ అసిస్టెంట్-బీ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్- కేటగిరీ 1 పోస్టులకు అయితే టెన్త్ పాస్ అయి ఉండి.. రెండేళ్లు ఐటీఐ అనుభవం సర్టిఫికెట్ అవసరం. మిగతా పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18- 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 12 నుంచి ప్రారంభం
అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 1 వరకు ఉంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్,ఓబీసీ అభ్యర్థులు రూ. 150 ఆన్ లైన్ విధానంలో పేమెంట్ చేయాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్ లైన్ విధానంలో పరీక్ష ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపిక అయిన అభ్యర్థులకు మొదట కర్ణాటకలోని కైగా పవర్ ప్లాంట్ లో ఉద్యోగం ఇస్తారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పలు సబ్ స్టేషన్లలో పనిచేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications