5204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్ష: హరీశ్ రావు కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5204 స్టాఫ్ నర్సుల పోస్టులను ఆన్‌లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్టాఫ్ నర్సు పోస్టుల కోసం 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పరీక్ష నిర్వహించేందుకు హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

Harish Rao

నిమ్స్ ఆస్పత్రి విస్తరణపై హరీశ్ రావు సమీక్ష : నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌ రావు మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో తొలిసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. నూతన భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు.

భవనం మొత్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని చెప్పారు. నిమ్స్‌ ఎంసీహెచ్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్‌ దవాఖానలతోపాటు నిమ్స్‌ విస్తరణకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.

Harish Rao

గాంధీ ఆస్పత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌గా రికార్డు సృష్టిస్తామని చెప్పారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ పనులను వేగవంతం చేయాలన్నారు.

నిమ్స్‌లో మాదిరిగా గాంధీలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్‌ డెడ్‌ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదించాలన్నారు. ఎంఎన్‌జే ఆస్పత్రిలో నూతనంగా ప్రారంభించిన ఆంకాలజీ బ్లాక్‌లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్‌ చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+