యువతకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ శుభవార్త.. నేడే లాస్ట్ డేట్ ??
బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 635 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, దరఖాస్తుల స్వీకరణకు నేడు (జూన్ 6, 2026) చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకు సూచించింది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఒక సంవత్సరం పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులో పని అనుభవం పొందాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం కానుంది. బ్యాంకింగ్ రంగంలో తొలి అడుగు వేయాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం. గడువు ముగిసేలోపు అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తం ఖాళీలు - 635
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 635 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 100 పోస్టులు ఉండగా, పంజాబ్‌లో 90 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో 20 పోస్టులు కేటాయించారు.
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషపై చదవడం, రాయడం, మాట్లాడడం వంటి ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి
2026 మే 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు తదితర రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
నెలకు స్టైఫెండ్
ఎంపికైన అప్రెంటీస్‌లకు నెలకు రూ.12,300 స్టైఫెండ్ అందజేయనున్నారు. అయితే డీఏ, టీఏ లేదా ఇతర అలవెన్సులు ఉండవని బ్యాంకు స్పష్టం చేసింది. శిక్షణ కాలం మొత్తం 12 నెలలు ఉంటుంది.
రాత పరీక్ష లేదు
ఈ నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఇంటర్మీడియట్ (10+2)లో సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్రాల వారీగా, జిల్లా వారీగా, కేటగిరీ వారీగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా NAPS, NATS పోర్టళ్లలో నమోదు చేసుకుని తమ ప్రొఫైల్‌ను 100 శాతం పూర్తి చేయాలి. ఆ తర్వాతే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.












Click it and Unblock the Notifications