నిరుద్యోగులకు రైల్వేశాఖ తీపికబురు.. DON'T MISS !
నిరుద్యోగ యువతకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. రైల్వేలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) బోర్డు ఆధ్వర్యంలో టెక్నీషియన్, ఫీల్డ్ ఇంజనీర్, సైట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మే 19 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు - 14
భర్తీ చేయనున్న ఖాళీలు..
టెక్నీషియన్ - 2 పోస్టులు
ఫీల్డ్ ఇంజనీర్ - 6 పోస్టులు
సైట్ ఆఫీసర్ - 6 పోస్టులు

విద్యార్హతలు..
టెక్నీషియన్ - ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
ఫీల్డ్ ఇంజనీర్, సైట్ ఆఫీసర్ - ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్, మెకానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిషియన్ వంటి విభాగాల్లో ఐటీఐ అర్హత అవసరం.
దరఖాస్తు ప్రక్రియ..
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ: ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైంది
దరఖాస్తుకు చివరి తేదీ: మే 19
దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు: పూర్తి మినహాయింపు
ఇతరులకు - రూ.300
వయోపరిమితి..
గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
పరీక్షా వ్యవధి: 2 గంటల 30 నిమిషాలు
ప్రశ్నల సంఖ్య: 125
వికలాంగ అభ్యర్థులకు అదనంగా 50 నిమిషాల సమయం
నెగెటివ్ మార్కింగ్ లేదు
అర్హత మార్కులు..
ఓపెన్, EWS అభ్యర్థులకు: 50%
SC, ST, BC, వికలాంగులకు: 45%
అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలవనున్నారు. నియామకానికి సంబంధించిన మరిన్ని వివరాలను www.rites.com వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications