జీపీఓ పోస్టుల ఫలితాలు రిలీజ్.. పోస్టింగ్ అప్పుడే?
తెలంగాణలోని గ్రామాల్లో పాలనను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మే 25వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ అర్హత పరీక్ష నిర్వహించారు. అయితే లేటెస్ట్ గా ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్ధులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
ఈ పోస్టులకు సంబంధించి రిజల్ట్స్, ర్యాంక్ కార్డులు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ccla.telangana.gov.in/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్ పూర్తి చేసి గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలుగా పని చేసి కనీసం ఐదేళ్లు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికేట్ల ఎంక్వైరీ లాంటి విధులు నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం.

మరోవైపు రాష్ట్రంలోని టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 783 పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి 777 మందితో కూడిన మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేయగా.. స్పోర్ట్స్ కోటాలో ఇద్దరికి చోటు కల్పించింది. ఇప్పటికే వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవగా.. జూన్ 10వ తేదీ వరకు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. నిర్దేశించిన ఆయా తేదీల్లో, నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications