నిరుద్యోగులకు ఆర్ఆర్‌బీ గుడ్ న్యూస్.. 9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు..
ఖాళీ పోస్టులు..
అసిస్టెంట్ లోకో పైలట్
మొత్తం ఖాళీలు..
9970
విద్యార్హత..
టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు..
అభ్యర్థుల 18 - 33 ఏళ్లు మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పదేళ్లు అదనపు సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
జీతం..
అన్ని అలవెన్సులు కలిపి రూ.50,000 పైనే ఉండొచ్చు.
దరఖాస్తుల స్వీకరణ..
ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లకు చివరి తేదీ మే 9 గా నిర్ణయించారు.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్ ద్వారా https://indianrailways.gov.in/ అప్లై చేసుకోవచ్చు. అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications