ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు "ఆర్ఆ‌ర్‌బీ" నోటిఫికేషన్.. భారీ జీతంతో !!

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు ప్రకటించింది. ఐసోలేటెడ్ కేటగిరీ (Isolated Category 08/2025) విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 311 పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. భారతీయ రైల్వే వ్యవస్థలో పని చేయాలనుకుని.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు ఈ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవచ్చు.

కాగా ఇప్పటికే 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను దశలవారీగా భర్తీ చేయాలనే లక్ష్యంతో ఈ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించింది. ఆలోపు ఈ మంచి ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ముఖ్యమైన అంశాలు కావడంతో, వీటిపై ఇప్పటి నుంచే గట్టి పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

rrb-notification-for-311-isolated-category-posts-with-huge-salary

నోటిఫికేషన్ వివరాలు..

పోస్టులు..

ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ లా అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ మరియు ఇతర విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు గడువు..

అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 నుంచి జనవరి 29, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ. 44,900 వరకు వేతనం లభిస్తుంది.

వయోపరిమితి..

అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని బోర్డు స్పష్టం చేసింది.

విద్యార్హతలు..

ఈ పోస్టులకు సంబంధించి పూర్తి స్థాయి విద్యార్హతల వివరాలు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-I & II), పోస్టును అనుసరించి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం rrbguwahati.gov.in వంటి అధికారిక వెబ్‌సైట్లను సందర్శించి తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+