RRB: ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ రిక్రూట్‌మెంట్..9000 పోస్టులు..

నిరుద్యోగుల‌కు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త‌ను అందించింది. ఈ మ‌ధ్య‌కాలంలో రైల్వే ఉద్యోగాల‌కు వ‌రుస నోటిఫికేష‌న్లు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో మ‌రోసారి ఆర్ఆర్‌బీ గుడ్‌న్యూస్ చెప్పింది. తొమ్మిదివేల టెక్నీషియ‌న్ పోస్టుల‌కు ప‌ట్నారైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ - I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ - III పోస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుంది. టెక్నీషియ‌న్ పోస్టుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ వ‌చ్చే నెల 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేసుకునేందుకు చివ‌రి తేది ఏప్రిల్ 8గా నిర్ణ‌యించ‌డ‌మైన‌ది. ఈ క్ర‌మంలో రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా ప్ర‌క‌టించింది. పూర్తివివ‌రాల కోసం అభ్యర్థులు https://indianrailways.gov.in/ లేదా https://www.rrbpatna.gov.in/ వెబ్‌సైట్‌లను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

ఆర్ఆర్‌బీ టెక్నీషియ‌న్ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్‌, ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులు అప్ల‌య్ చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక‌, ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వేషన్‌ ఉన్న అభ్యర్థులు మాత్రం 250 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అప్లయ్ చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ముందుగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌-1 ఉంటుంది. సీబీటీ-2, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఆర్ఆర్‌బీ టెక్నిషీయ‌న్ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు కేవ‌లం ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

RRB: RRB Technician Recruitment..9000 Posts..

వేత‌న వివ‌రాలు : ఆర్ఆర్‌బీ టెక్నీషియ‌న్ పోస్టుల‌కు ఎంపీక‌యిన వారికి ఆక‌ర్ష‌ణీయ‌మైన వేత‌నం ఉంటుంది. గ్రేడ్‌ల‌ను బ‌ట్టి వేత‌నాలు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 అభ్యర్థులకు నెల‌కు రూ.29,200 ఉంటుంది. ఇక‌, టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 అభ్యర్థులకు మాత్రం నెల‌కు రూ.19,900 వేతనం ఉంటుంది. ఈ పోస్టుల‌కు సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను అక్టోబర్‌/ డిసెంబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన వచ్చే ఏడాది ఫిబ్రవరిలోచేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+