రేపటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు..
తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు రేపటి (జులై 18) నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో 11,062 డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5 వ తేదివరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ నిర్వహణ, డిఎస్సీ ప్రిపరేషన్ వ్యవధి సరిపోవడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్రంలో 11,062 పోస్టుల భర్తీకి సుమారు 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఈ ఏడాది మొదటిసారిగా డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ఈ పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను ఈ నెల 11న విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నిన్న (మంగళవారం) సాయంత్రానికి 2,40,727 మంది తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

డీఎస్సీ పరీక్షలు రోజుకు రెండు షిప్టుల్లో జరగనున్నాయి .తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. డీఎస్సీ హాల్‌టిక్కెట్లలో తప్పులు దొర్లాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్ధులు రావడంతో వాటిని సరిచేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications