Telangana SSC Exams: పదో తరగతి అభ్యర్ధులకు గుడ్ న్యూస్-ఆ రూల్ స్ధానంలో మరో ఊరట..!
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లూ పరీక్షలు రాసేందుకు హాజరయ్యే విద్యార్ధులకు ఉన్న ఓ నిబంధనను ఎత్తేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాని స్ధానంలో మరో ఊరట కల్పించింది. దీంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్ధులకు ఊరట కలగబోతోంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఇప్పటివరకూ తెలంగాణలో పదో తరగతి రాసే విద్యార్దులకు అమల్లో ఉన్న ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను ప్రభుత్వం ఈసారి ఎత్తేసింది. ఈసారి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు నిర్ణీత సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించాలని నిర్ణయించింది. అయితే ఈ ఒక్క నిమిషం స్దానంలో ఐదు నిమిషాల పాటు గ్రేస్ టైమ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈసారి పదో తరగతి రాసే విద్యార్ధులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.

ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విషయంలో అక్కడక్కడా ఆలస్యం జరుగుతుండటంతో ఒక్క నిమిషం నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. పరీక్ష రాసే విద్యార్ధుల్లోనూ దీనిపై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క నిమిషానికి బదులు ఐదు నిమిషాల పాటు ఊరట కల్పించింది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులకు 9.35 వరకూ పరీక్ష హాల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications