నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.. 607 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ !
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ పోస్టుల భర్తీ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU), శాతవాహన యూనివర్సిటీ (SU), పాలమూరు యూనివర్సిటీ (PU) వంటి ప్రముఖ వర్సిటీలలో ఖాళీగా ఉన్న అభ్యాసక ఉపాధ్యాయుల నియామకం జరగనుంది. కాగా దరఖాస్తు ప్రక్రియజూలై 10 నుండి జూలై 17 సాయంత్రం 5 గంటల లోపు అధికార వెబ్‌సైట్ http://mhsrb.telangana.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

అలానే అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే జూలై 18 నుండి 19 సాయంత్రం 5 గంటల లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక్కటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే, ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ప్రతి యూనివర్సిటీకి రోస్టర్ పాయింట్ల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు పాటిస్తూ నియామక ప్రక్రియ కొనసాగనుంది.
పోస్టుల విభజన..
మల్టీ జోన్ - 1: 379 పోస్టులు
మల్టీ జోన్ - 2: 228 పోస్టులు
జీతభత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విధానానికి అనుగుణంగా రూ.68,900 నుండి రూ.2,05,500 వరకు నెలవారీ జీతం లభించనుంది. మరో 8 యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీపై కూడా అధికారులు సమీక్ష కొనసాగిస్తున్నారు. త్వరలో ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.
మరోవైపు 15 సంవత్సరాల కాంట్రాక్టు సేవలతో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రస్తుతం ఉన్న స్థానాల్లో కొనసాగనున్నారు. కొత్తగా భర్తీ చేయబోయే పోస్టులు పూర్తిగా ఖాళీగా ఉన్న స్థానాలేనని తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియతో రాష్ట్రంలో ఉన్నత విద్య రంగంలో ఖాళీలను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications