గురుకులాల్లో 2591 పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదలవుతున్నాయి. తాజాగా, బీసీ గురుకులాల్లో 2591 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.బీసీ సంక్షేమ శాఖ, జ్యోతిబా పూలే బీసీ విద్యాసంస్థలకు పోస్టులు మంజూరు చేసింది. దీంతోపాటు 33 రెసిడెన్షియల్ పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి ఆమోదం లభించింది.

కొత్తగా ప్రారంభించిన కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి కూడా ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నాలుగు జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

ఇది ఇలావుండగా, ఆర్ అండ్ బీ శాఖలో అదనపు ఉద్యోగ నియామకాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీలోని పలు విభాగాల్లో 472 అదనపు పోస్టులు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. 28 డీఏ ఆఫీసర్, టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు కూడా ఆమోదం తెలిపింది.

Telangana government green signal to fill 2591 posts in Gurukul

జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: 1392 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తాజాగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి జనవరి 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. జూన్ లేదా జులైలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడకపోవడం గమనార్హం. దీంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+