jobs alert: డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భ‌ర్తీకి ఉత్త‌ర్వులు

హైదరాబాద్: నిరుద్యోగులకు మంచి అవకాశం అందించింది రాష్ట్ర సర్కారు. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన 527 మంది లెక్చ‌ర‌ర్ల‌ను, 341 మందిని ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిన‌, 50 మంది టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంట‌ర్ల‌ను హోన‌రేరియం కింద‌, 1,940 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ పోస్టుల కాల‌ప‌రిమితి 2024, మార్చి 31తో ముగియ‌నుంది.

పోస్టుల వివ‌రాలు:

లెక్చ‌ర‌ర్లు -527
టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంట‌ర్లు - 50
గెస్ట్ ఫ్యాక‌ల్టీ - 1,940
సీనియ‌ర్ అసిస్టెంట్ -29
డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ - 31
స్టోర్ కీప‌ర్ - 40
జూనియ‌ర్ స్టెనో - 01
రికార్డు అసిస్టెంట్ - 38
మ్యూజియం కీప‌ర్ -07
హెర్బేరియం కీప‌ర్ -30
మెకానిక్ - 08
ఆఫీసు సబార్డినేట్ - 157 పోస్టులు ఉన్నాయి.

 telangana govt ordered to recruit lecturers and other posts in colleges on contract basis

గ్రూప్-2 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణ‌లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భ‌ర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, గ్రూప్-2 అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తులో వివ‌రాల స‌వ‌ర‌ణ‌కు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది. జులై 8వ తేదీ నుంచి 12వ తేదీ మ‌ధ్య‌లో అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు.

గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్ర‌వ‌రి 16 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను ఆగ‌స్టు 29, 30 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా, ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ ప‌డుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+