తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

తెలంగాణలో మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండీయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో వెల్లడించారు.

Telangana Inter Advanced Supplementary Exam Time Table Released

ఇంటర్ ఒకేషనల్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇదే టైం టేబుల్ వర్తిస్తుందని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇక, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. జూన్ 9న ఇంటర్ ఫస్టియర్, 10న ఇంటర్ సెకండీయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టీకల్ పరీక్షలు ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 30 తుది గడువు అని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్, సెకండీయర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండీయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే పాస్ పర్సంటేజ్ పెరిగిందని భట్టి చెప్పారు.

ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం ఉతీర్ణత సాధించారని చెప్పారు. మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీలో సప్లి పరీక్షలు ఇలా

మరోవైపు, ఏపీలోనూ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చింది. మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇటీవల ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండీయర్ విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య జూన్ 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+