తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇదే..!
తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాతే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖారారు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారమే. పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది (2025) మార్చి 17 నుంచి 31 వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక ఆప్డేట్ వచ్చింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications