తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ అప్పుడే.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
తెలుగు రాష్ట్రాల్లో రిజల్ట్స్ సైరన్ మోగుతుంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్, టెన్త్ ఫలితాలు వెలువడగా.. తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా రిజల్ట్స్ విషయంలో గందరగోళం నడుస్తోంది. మెమోలో మార్పులు సహా పలు అంశాల విషయంలో జాప్యం కారణంగా ఫలితాల విడుదలలో ఆలస్యం అవుతూ వచ్చింది.
అయితే తాజా సమాచారం ప్రకారం 30వ తేదీన పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. టెన్త్ పరీక్షల మూల్యాంకనం, మార్కుల కంప్యూటరీకరణ సహా అన్ని వారం రోజుల క్రితమే పూర్తయ్యాయి. అయితే విద్యాశాఖ సీఎం రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉండడంతో ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు. కానీ సీఎం బిజీ షెడ్యూల్ వల్ల ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్టు చెబుతున్నారు.

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్ధులు తమ TS SSC మార్కులను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలానే ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సైతం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
మెమోల్లో మార్పులు
ఈసారి టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఇప్పటివరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు జారీ చేసేవారు. కానీ ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్‌తో పాటు, విద్యార్థి మార్కులు మోమోలో పొందుపరుస్తారని అంటున్నారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ లో ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఎగ్జామ్స్ లో.. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications