గ్రూప్-4 ఫలితాలపై స్పందించిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జులై 1న గ్రూప్-4 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తే భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏళ్లు పట్టేదని.. కానీ, ఇప్పుడు రెండు నెలల్లోనే పూర్తి చేస్తున్నామని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.
మంగళవారం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రక్రియలో ఒకట్రెండు సమస్యలకు వ్యవస్థనే తప్పు పట్టడం సరికాదన్నారు. గ్రూప్-4 ఫలితాలు కొంత సమయం పడుతుందన్నారు. కాగా, 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 1న నిర్వహించిన గ్రూప్-4 పరీక్షకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

పేపర్-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని జనార్ధన్ రెడ్డి తెలిపారు. అయితే, గ్రూప్-4 ఫలితాల విడుదలకు మరింత సమయం ఉందని ఆయన చెప్పారు.
ఈ క్రమంలో గ్రూప్-4 పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం మరింత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కనీసం ప్రాథమిక కీ అయిన విడుదల చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు. పేపర్ వాల్యూయేషన్ ఆలస్యం కావడంతో కీని విడుదల చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications