UGC NET Decmber 2023 Results: యూజీసీ నెట్ ఫలితాల విడుదల-స్కోర్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి...
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్ మెంట్ తో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన నెట్ పరీక్ష ( UGC NET Decmber 2023 Results) ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి. డిసెంబర్ 2023 సెషన్ లో భాగంగా నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తోంది. యూజీసీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచనున్న ఈ ఫలితాలను ఎలా తెలుసుకోవాలన్న దానిపై ఎన్టీఏ పలు సూచనలు కూడా చేసింది.
యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్ 2023 పరీక్షల్ని గతేడాది డిసెంబర్ 6 నుంచి 14 వరకూ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 292 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 9.45 లక్షల మంది అభ్యర్ధులు రాశారు. వీరంతా ఇవాళ విడుదలయ్యే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరు ఫలితాలను యాక్సెస్ చేసేందుకు అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ను సందర్శించాల్సి ఉంటుంది. వీటిలో స్కోర్ కార్డుల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎన్టీయే వెల్లడించింది.

యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్ కీని ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఏ.. ఫైనల్ ఆన్సర్ కీని మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఇవాళ ఫలితాలతో పాటు ఈ ఫైనల్ ఆన్సర్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. యూజీసీ నెట్ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in లో విడుదల చేస్తోంది.
అభ్యర్ధులు ఫలితాలు తెలుసుకోవడానికి, స్కోర్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెబ్ సైట్ లోకి వెళ్లి డిసెంబర్ సెషన్ లింక్ పై క్లిక్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. దరఖాస్తు నంబర్లు, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక తమ వివరాలు ఎంటర్ చేస్తే స్కోర్ కార్డులు కనిపిస్తాయి. వీటిని డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకుని ఉంచుకుంటే భవిష్యత్ అవసరాలకు పనికొస్తాయి.












Click it and Unblock the Notifications