యూపీఎస్సీ పరీక్షల్లో ఇకపై ఆ రూల్ పక్కా !!!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల నిర్వహణలో ఒక కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం, నకిలీ అభ్యర్థులు మరియు అక్రమాలను పూర్తిగా అడ్డుకోవడం లక్ష్యంగా కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై యూపీఎస్సీ నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని యూపీఎస్సీ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఏఐ ఆధారిత టెక్నాలజీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీని యూపీఎస్సీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా పరీక్షా కేంద్రానికి వచ్చిన అభ్యర్థి ముఖాన్ని డిజిటల్‌గా స్కాన్ చేసి.. దరఖాస్తు సమయంలో సమర్పించిన ఫొటోతో సరిపోల్చుతారు. దీంతో గుర్తింపు లోపాలు లేకుండా ఖచ్చితంగా జరుగుతుందని చెబుతున్నారు.

కాగా 2025 సెప్టెంబర్ 14న నిర్వహించిన NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), NA (నావల్ అకాడమీ) II, CDS (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) II పరీక్షల్లో ఈ ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని పైలట్ ప్రోగ్రామ్‌గా యూపీఎస్సీ విజయవంతంగా పరీక్షించింది. గురుగ్రామ్‌లోని కొన్ని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసి, అభ్యర్థుల గుర్తింపును డిజిటల్ పద్ధతిలో ధృవీకరించారు.
ఇక ఈ కొత్త విధానంపై యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ స్పందిస్తూ.. ఫేస్ అథెంటికేషన్ వల్ల ఒక్కో అభ్యర్థి వెరిఫికేషన్‌కు పట్టే సమయం సగటున 8 నుంచి 10 సెకన్లకు తగ్గిందని తెలిపారు. గతంలో మాన్యువల్ వెరిఫికేషన్‌కు ఎక్కువ సమయం పట్టేదని.. ఇప్పుడు ఇది వేగంగా, సురక్షితంగా జరుగుతోందని వివరించారు. దీనివల్ల పరీక్ష ప్రారంభంలో ఏర్పడే గందరగోళం కూడా తగ్గుతుందని చెప్పారు.
నకిలీ అభ్యర్థులకు చెక్..
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఇతరుల పేర్లతో పరీక్ష రాయడం, డమ్మీ అభ్యర్థులను పంపించడం వంటి అక్రమాలపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫేస్ అథెంటికేషన్ అమలుతో ఇలాంటి మోసాలకు పూర్తిగా చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. బయోమెట్రిక్ పద్ధతుల కంటే ఇది మరింత సమర్థవంతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సివిల్ సర్వీసెస్ (IAS, IPS, IFS), NDA, CDS, CAPF, EPFO తదితర యూపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షల్లో ఈ ఫేస్ అథెంటికేషన్ విధానం అమలులోకి రానుంది. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేటప్పుడు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేకుండా, డిజిటల్ గుర్తింపు ద్వారానే వెరిఫికేషన్ జరుగుతుంది.
అభ్యర్థులకు లాభాలు ఏమిటి?
ఈ కొత్త విధానంతో అభ్యర్థులకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పరీక్షా కేంద్రాల్లో వేచి ఉండే సమయం తగ్గుతుంది
గుర్తింపు పొరపాట్లకు అవకాశం ఉండదు
పరీక్షా ప్రక్రియపై నమ్మకం పెరుగుతుంది
న్యాయమైన పోటీకి మార్గం సుగమమవుతుంది
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications