UPSC లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా..?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఎకానమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 47 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మార్చి 4 చివరితేదీగా పేర్కొంది. పూర్తి వివరాలు మీకోసం..

మొత్తం పోస్టులు: 47
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 12, 2025
అప్లికేషన్ ముగింపు తేదీ : మార్చి 3, 2025
అప్లికేషన్ ఎడిట్ తేదీ : మార్చి 5 నుంచి మార్చి 11 వరకు ఉంటుంది.
పరీక్ష తేదీ : జూన్ 20, 2025, కాగా హాల్ టికెట్లు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు రిలీజ్ అవుతాయి.
అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 200గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. కనిష్ట వయసు 21 సంవత్సరాలు కాగా.. గరిష్ట వయసు 30 ఏళ్లుగా ఉంది. ఇండియన్ ఎకానిమిక్ సర్వీసెస్ 12, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ 35 పోస్టులు ఉన్నాయి. పరీక్ష ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.












Click it and Unblock the Notifications