యూపీఎస్సీ : మెయిన్స్‌ పరీక్షలకు ఎంపికైన అభ్య‌ర్థుల లిస్ట్ వ‌చ్చేసింది..!

యూపీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఓ ముఖ్య‌గ‌మ‌నిక‌... సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌య్యింది. అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ పేర్ల‌ను చెక్ చేసుకోగ‌ల‌రు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ విభాగాల్లో ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ ప్రాథ‌మిక పరీక్షను యూపీఎస్సీ జూన్ 16వ తేదిన నిర్వ‌హించింది. ఇక‌, ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఈ నెల ఒక‌టో తేదిన యూపీఎస్సీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ‌లితాలు వెల్ల‌డించిన సమయంలో కేవలం అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను మాత్రమే యూపీఎస్సీ ప్రకటించింది. అయితే, తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల రోల్‌ నంబర్లు, పేర్ల జాబితాను కూడా ప్ర‌క‌టించింది.

మెయిన్స్ ఎంపికైన అభ్య‌ర్థుల జాబితాను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌ పరీక్షకు మొత్తం 14627 మంది అర్హత సాధించ‌గా, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్ మెయిన్స్‌కు 2158 మంది అభ్యర్థులు అర్హ‌త సాధించారు. మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 20 నుంచి ఐదురోజుల‌పాటు సివిల్స్ ప్రధాన పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. నవంబరు 24 నుంచి మొత్తం 7 రోజులపాటు ఐఎఫ్‌ఎస్ మెయిన్స్‌ పరీక్షలు ఉండ‌నున్నాయి.

UPSC The list of selected candidates for the mains examination has arrived

సివిల్, ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్స్ పరీక్ష విధాన‌మిదే..

సివిల్ స‌ర్వీసెస్ మెయిన్స్ ప‌రీక్ష మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. దీంతో పాటు ఇంట‌ర్వ్యూ కూడా ఉంటుంది. ఇది 275 మార్కులకు ఉంటుంది. ఈ రెండు క‌లిపి 2025 మార్కులకు ఫైన‌ల్ ఎంపిక చేస్తారు. మెయిన్స్ ప‌రీక్షలో మొత్తం 7 పేపర్లు ఉండ‌గా, అందులో ఒక్కో పేపరుకు 250 మార్కులు ఉంటుంది. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున పేపర్-ఎ, పేపర్-బి ఉంటాయి. ఇవి కేవ‌లం క్వాలిఫయింగ్ పేపర్లు మాత్ర‌మే. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్స్ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం ఆరు పేపర్లు. పేపర్-1లో జనరల్ ఇంగ్లిష్ 300 మార్కులు ఉండ‌గా, పేపర్-2లో జనరల్ నాలెడ్జ్-300 మార్కులకు నిర్వ‌హిస్తారు. పేపర్-3, పేపర్-4, పేపర్-5, పేపర్-6ల‌లో రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో ప‌రీక్ష‌లు ఉంటాయి. వీటికి ఒక్కో పేపరుకు 200 మార్కులు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+