ఎల్లుండి విజయవాడలో జాబ్ మేళా..! కియా సహా ఈ కంపెనీల్లో ఉద్యోగాలు..!
ఏపీలోని రాజధాని నగరం అమరావతి పరిధిలోని విజయవాడ (Vijayawada)లో ఎల్లుండి (ఫిబ్రవరి 21)న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ జాబ్ మేళా (job mela) నిర్వహిస్తోంది. నగరంలోని తాడిగడపలోని శ్రీ కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తాడిగడప-పోరంకి 100 ఫీట్ రోడ్డులోని శ్రీ కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో 21వతేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుంది. ఇందులో కియా ఇండియా, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్, హెటురో ల్యాబ్స్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డామినీర్ ఇంటీరియర్స్, ఆస్ట్రాజెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారత్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బిగ్ సి మొబైల్స్, బజాజ్ క్యాపిటల్, సంతోష్ ఆటోమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ డయల్ లిమిటెడ్, ఎబిసిపాండా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి 16కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి.

ఆయా కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 21న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. ఆసక్త, అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫారాలతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7981368429, 8885159008, 9676708041 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.












Click it and Unblock the Notifications