అప్పటి వరకు గ్రూప్-1 పరీక్ష ఫలితాలు వెల్లడించం: హైకోర్టుకు టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ.. వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.
వచ్చే సోమవారం అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని తెలిపింది. అప్పటి వరకు గ్రూప్-1 ఫలితాలు ఇవ్వబోమని హైకోర్టుకు టీఎస్ పీఎస్సీ తెలిపింది. కాగా, ఇప్పటికే పేపర్ లీకేజీ కారణంగా గతంలో జరిగిన ప్రిలిమ్స్ రద్దయిన విషయం తెలిసిందే.
ఈ వారంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రైమరీ ఆన్సర్ కీ?

జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీని కమిషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 తుది ఆన్సర్ కీ ఈ వారంలో వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు పూర్తిచేసింది. త్వరలో తుది కీ కూడా విడుదల చేయనుంది. అనంతరం వచ్చేనెలలో ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. కాగా, గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2.33 లక్షల మందికి పైగా హాజరయ్యరు.
పరీక్షకు హాజరైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ విధానంలో సేకరించిన అభ్యంతరాల అనంతరం రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను కమిషన్ ప్రకటిస్తుంది. కాగా, మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే జులై 1న నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ కూడా దాదాపు పూర్తయింది. ప్రిలిమినరీ కీతో పాటు ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ఇమేజ్‌లను త్వరలో కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచనుంది.












Click it and Unblock the Notifications