భారతీయ విద్యార్ధుల్లేక అమెరికా వర్శిటీల విలవిల..! రీజన్స్ ఇవే..!

గతేడాది జనవరి ముందు వరకూ అమెరికా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్ధుల ప్రవేశాలు భారీ స్ధాయిలో ఉండేవి. ముఖ్యంగా బారతీయ విద్యార్ధులు అక్కడే ఎంఎస్, ఇతర కోర్సులు చదువుకుని, అక్కడే ఉద్యోగాలు చేసుకునేందుకు మొగ్గు చూపేవారు. కానీ గత ఏడాది కాలంగా పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. అమెరికాలోని అన్ని యూనివర్శిటీల్లో కలిపి భారతీయ విద్యార్ధుల ప్రవేశాలు (indian student enrollment) దాదాపు 45 శాతం తగ్గిపోయాయని తాజా రిపోర్ట్ చెబుతోంది.

గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (GMAC) తాజా నివేదిక ప్రకారం.. ఇది ప్రధాన అంతర్జాతీయ విద్యార్థి సమూహాలలో అత్యధిక క్షీణతగా నమోదైంది. వీసా అనిశ్చితి, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు, రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. 2025 ఆగస్టు నాటికి అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల మొత్తం కొత్త ప్రవేశాల్లో ఏడాది పొడవునా సాగిన క్షీణత ట్రెండ్ ను ఇది సూచిస్తోది. అయితే భారతీయ విద్యార్థుల చేరికలలో క్షీణత చైనా, దక్షిణ కొరియా, నైజీరియా వంటి ఇతర దేశాల కంటే చాలా తీవ్రంగా ఉంది.

Why Indian Student Enrollment in US Colleges Plummeted by 45 Visa Delays and Job Market Fears

వీసా సంబంధిత ఆంక్షలే ఈ పతనానికి ముఖ్య కారణమని జీఎంఏసీ గుర్తించింది. 2025 మేలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రాసెసింగ్ బ్యాక్‌లాగ్ ఏర్పడింది. ఇది భారతీయ దరఖాస్తుదారులను తీవ్రంగా ప్రభావితం చేసింది. అడ్మిషన్లు పొంది, డిపాజిట్లు చెల్లించినా చాలా మంది విద్యార్థులు సకాలంలో క్యాంపస్‌లో చేరలేకపోయారు. అమెరికన్ విశ్వవిద్యాలయాల సర్వే ప్రకారం 90% సంస్థలు, భారతీయ విద్యార్థులు అంగీకరించి కూడా చేరలేదని తెలిపాయి. వీసా జాప్యం లేదా తిరస్కరణే ఈ ధోరణికి ప్రధాన కారణంగా తేలింది.

Why Indian Student Enrollment in US Colleges Plummeted by 45 Visa Delays and Job Market Fears

2025 జనవరిలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక, రాజకీయ సంకేతాలు, విధానాల వల్ల 40% అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఆసక్తి కోల్పోయారు. ముఖ్యంగా భారతీయ అభ్యర్థులు నిరాశపడ్డారు. చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలపై నెలకొన్న అనిశ్చితి మరో కీలక అవరోధంగా మారింది. అమెరికాలో అధిక విద్యా ఖర్చులను భర్తీ చేసుకోవడానికి భారతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగంపై ఆధారపడతారు. H-1B హై-స్కిల్డ్ వర్క్ వీసా, విస్తృత వలస విధానంలో గందరగోళం మధ్య వారు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. F-1 విద్యార్థి వీసాపై స్టెమ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ తర్వాత 12 నెలలు అమెరికాలో పనిచేయడానికి వీలు కల్పించే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిలిపివేత ప్రభావం భారతీయ విద్యార్థుల ఆసక్తిని తగ్గించింది. అమెరికా పట్ల ఆసక్తి తగ్గుతుండటంతో, భారతీయ విద్యార్థులు పశ్చిమ యూరప్, ఆసియా దేశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఈ డేటా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+