పరీక్ష లేకుండానే..పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖలో కొలువులు..
నిరుద్యోగులకు శుభవార్త.. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం పదోతరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు విడుదల కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. ఇక, ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ రావాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల క్రమంలో ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కానుంది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జనవరిలో తపాలా శాఖలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక, ఈ ఏడాది నోటిఫికేషన్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ కొలువులు చేపడతారు. ఇక, ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సొంత గ్రామంలోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. గ్రామీణ పోస్టల్ శాఖలో కేవలం 4 గంటలు మాత్రమే పని ఉంటుంది.

తెలుగు భాష, సైకిల్ తొక్కడం వచ్చినట్లయితే ఈ GDS పోస్టల్ నోటిఫికేషన్ కి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి రూ.10 వేల నుంచి రూ.12వేల శాలరీ తీసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.












Click it and Unblock the Notifications