తేల్చి చెప్పిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రత్యామ్నాయం తప్పదు..!!

తెలంగాణ పై కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దక్షిణాది పై పట్టు జారకుండా ముందస్తు వ్యూహాలు అమలు చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, కర్ణాటక.. తెలంగాణ, కేరళలో అధికారంలో ఉంది. దీంతో.. తెలంగాణలో ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతీ పరిణామం పరిశీలిస్తోంది. అందులో భాగంగా సీఎం రేవంత్ సహా పార్టీ ముఖ్యులకు తాజా సమీక్షలో కీలక దిశా నిర్దేశం చేసారు. తమ వైఖరి తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం- పార్టీ వ్యవహారాల పైన చర్చకు వచ్చింది. సమన్వయం.. లక్ష్యాల సాధన పైన ఆరా తీసారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ఓటర్ల ప్రక్రియ పైన ప్రధాన చర్చ జరిగింది. కొందరు నేతలు సర్ పక్రియను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయని వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలో భర్తీ చేయాల్సిన పీసీసీ తో సహా ఏ నామినేటెడ్ పదవి అయినా సర్ పక్రియ పూర్తయిన తరువాత మాత్రమే ఆలోచన ఉంటుందని స్పష్టం చేసారు. అందరూ సర్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఆ కార్యక్రమం పైనే ఫోకస్ చేయాలని తేల్చి చెప్పారు.

aicc-made-clear-directions-for-tpcc-and-party-leaders-over-sir-process-fixed-big-task

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

ఎవరైనా సర్ పక్రియ పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యామ్నాయం చూడాలని నిర్దేశించారు. ఏ ఒక్క ఓటు కూడా నష్టపోకూడదని స్పష్టం చేసారు. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, ఎస్‌ఎస్‌ఏ (సంఘటన్ సృజన్ అభియాన్) కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. సమీక్షలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ), మండల కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల పనితీరు, పార్టీ విస్తరణ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. పార్టీలో సమన్వయానికి సంబంధించిన అంశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా.. పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం ప్రస్తావనకు రాగా.. సర్ ప్రక్రియ రాష్ట్రంలో పూర్తయిన తరువాత నిర్ణయం తీసుకుందామని వేణుగోపాల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+