రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే రూ.70వేలు వచ్చాయి!!
ప్రస్తుతం కాలం మారింది. దీంతోపాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. ఈరోజు ఉన్న ప్రేక్షకుడి ఆలోచన రేపు ఉండటంలేదు. అలాగే నిర్మాతలు కూడా మారుతున్నారు. పెట్టిన పెట్టుబడిని వెంటనే రాబట్టుకొని నష్టాల నుంచి బయటపడటానికి సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసి కలెక్షన్లను తెచ్చుకుంటున్నారు. సినిమా పర్వాలేదు.. యావరేజ్ అనే టాక్ వచ్చినా చాలు.. ఆ నిర్మాత నష్టాల నుంచి బయటపడేంత కలెక్షన్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ సినిమా కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం జరుపుకుంది. విడుదలైన తర్వాత కనీసం రూ.70వేలు కూడా వసూలు చేయలేనంత ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది.
కనీస వసూళ్లు కూడా రాలేదు
హిందీలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ది లేడీ కిల్లర్ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. అజయ్ బేహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. భారతదేశ సినీ చరిత్రలోనే అత్యంత దారుణమైన చెత్త సినిమాగా రికార్డును మూటకట్టుకుంది. సస్పెన్స్ త్రిల్లర్ నేపథ్యంలో సినిమాను తీర్చిదిద్దారు. షూటింగ్ సమయంలో రూ.45 లక్షలు ఖర్చు చేయగా, ప్రమోషన్స్, ఇతరత్రా కలిపి రూ.2 కోట్లు అయింది. తీరా సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. మొత్తంగా ది లేడీ కిల్లర్ సినిమా రూ.70వేలు రాబట్టింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే థియేటర్లలో విడుదల చేశారు.

అత్యంత చెత్త రికార్డును సృష్టించింది
సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వస్తే కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయడంతోపాటు మరికొన్ని సన్నివేశాలను కలుపుదామని నిర్మాత, దర్శకులు భావించారు. అయితే ప్రేక్షకుల నుంచి ఘోరమైన స్పందన రావడంతో అత్యంత భారీ డిజాస్టర్ గా రికార్డును తన పేరుమీద లిఖించుకుంది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ రికార్డును బద్ధలు కొట్టలేకపోయింది. ఓటీటీలో విడుదల చేసినా కోట్లరూపాయలు వస్తున్నాయి. ఈ సినిమా కనీసం రూ.లక్ష కూడా రాబట్టలేకపోయిందంటే ఎంత దారుణమైన పరాజయమూ ఊహించుకోవచ్చు.












Click it and Unblock the Notifications