రూ. 100 కోట్ల సినిమా అనుకుంటే బిస్కెట్ అయిందే..!
భారతీయ సినీ చరిత్రలో 'పాన్-ఇండియా' అనే పదానికి అర్థం చెప్పి, సినిమా వ్యాపార రూపురేఖలను మార్చేసిన సంచలన సృష్టి 'బాహుబలి'. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం, పదేళ్ల క్రితం (మొదటి భాగం 'ది బిగినింగ్') ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అపారమైన వ్యయంతో, అద్భుతమైన కల్పనా శక్తితో రాజమౌళి నిర్మించిన మాహిష్మతి రాజ్యం కేవలం ఒక కల్పన కాదు, అది ఒక అనుభూతి.
'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నకు సమాధానంగా వచ్చిన 'ది కన్‌క్లూజన్' సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ ఢంకా మోగించింది. ఇప్పుడు, ఆ రెండు భాగాలను కలిపి, సినిమా చరిత్రలో మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ... 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

రెండు భాగాలను కలిపి రాజమౌళి పర్యవేక్షణలో 3 గంటల 45 నిమిషాల నిడివితో విడుదలైనప్పటికీ, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత ఆదరణ లభించింది. వరుసగా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.
కేవలం వారం రోజుల్లోనే ఈ రీ-ఎడిటెడ్ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్లు వసూలు చేసి, అత్యధిక కలెక్షన్లు సాధించిన రీ-రిలీజ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇండియాలో రూ. 29.65 కోట్లు వసూలు చేసిన ఈ 'ఎపిక్'.. త్వరలో 'సనమ్ తేరీ కసమ్' (రూ. 39 కోట్లు) రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. బాహుబలి ప్రభంజనం ఇప్పటికీ థియేటర్లలో కొనసాగుతూనే ఉంది.
అయితే ఈ సినిమా రి రీలీజ్ చేసే సమయంలో రూ. 100 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా ఓవరాల్‌గా 60 కోట్లు సాధించేలా కనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications