సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత మృతి..

సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ క‌న్న‌డ సినీ ర‌చ‌యిత శ్యామ్ సుందర కులకర్ణి మృతిచెందారు. అయితే, ఈయ‌న మ‌ర‌ణ‌వార్త కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. తీవ్ర ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న అక్టోబర్ 31వ తేదిన కన్నుమూశారు. శ్యామ్ సుందర కులకర్ణి ఎన్నో ప్రముఖ పాటలకు సాహిత్యం అందించారు.

శ్యామ్ సుందర కులకర్ణి గత ప‌ది సంవ‌త్స‌రాల నుంచి తీవ్ర‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించి గ‌త నెల (అక్టోబర్) 31వ తేదిన తుదిశ్వాస విడిచారు. ఆయ‌న కేవ‌లం ఒక సినీ ర‌చ‌యిత‌గానే కాకుండా జ‌ర్న‌లిజంలో కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయన ఎన్నో వ్యాసాలను కూడా రాశారు. అవి పాఠకులను ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. శ్యామ్ సుంద‌ర కుల‌క‌ర్ణి నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, నటి కల్పన వంటి ప్రముఖ కళాకారులను కూడా ఇంటర్వ్యూ చేశారు. అంతేకాదు, ఈయ‌న‌కు చాలామంది క‌ళాకారుల‌తో మంచి అనుభ‌వం ఉంది.

A great tragedy in the film industry The death of a famous film writer

ఎన్నో అద్భుత‌మైన పాట‌లు..

శ్యామ్ సుంద‌ర్ 'చలగరా' సినిమాలో ఓ అద్భుత‌మైన పాట‌ను రాశారు. అదే'ముదండ రవి..' ఈ పాట ద్వారా ఆయ‌న‌ సినీ పరిశ్రమలో లిరిసిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వాటితో పాటు అనేక చిత్రాల్లో అద్భుత‌మైన పాటలు రాశారు. 'బేసుగే' మూవీలో శ్యామ్ సుందర్ కులకర్ణి రాసిన 'యావ పువ్వు యారా ముడిగో' పాట నేటికీ ప్రేక్ష‌కుల్తో ఎంతో ఆదరణ పొందింది.

ఈ పాట ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. 'హీరో నేనే హీరో నానే', 'షికారి' 'ప్రీతితీ ప్రేమీ', అనంత్ నాగ్ 'గౌరి' వంటి సినిమాల‌కు పాట‌లు రాశారు. అంతేకాదు, గణేష్ లోని 'నిన్మ మగువు నాగుతిరువా..' పాటతో ఆయ‌న‌కు మంచి గుర్తింపు ల‌భించింది. వీటితోపాటు 'భరత్' చిత్రంలోని 'నీలి బాణాలి..' ఎంతో స‌క్సెస్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+