పవన్‌కల్యాణ్ - సౌందర్య కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్‌ బస్టర్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కొణిదెల పవన్ కల్యాణ్ తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే ఎన్నో సినిమాలు చేశారు. వరుసగా సూపర్ హిట్లు కొడుతూ పవర్ స్టార్‌గా ఆవిర్భవించారు. మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదలు మొన్నటి వకీల్ సాబ్, భీమ్లానాయక్ వరకు ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించారు. తన కెరీర్ లో రెండో చిత్రం గోకులంలో సీత కాగా, మూడో చిత్రంగా సుస్వాగతంలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమేకాదు.. తన నటనచేత అందరిచేత శభాష్ అనిపించుకున్నారు పవన్ కల్యాణ్.

భీమినేనికి ఫోన్ చేసిన పవన్
పవన్ కల్యాణ్ సరసన దేవయాని హీరోయిన్ గా నటించింది. అయితే దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఆలోచనల్లో మాత్రం కేవలం సౌందర్య ఒక్కరే ఉన్నారు. ఆ పాత్రకు ఆమె ఒక్కరే న్యాయం చేయగలరనే నమ్మకంతో ఉన్నారు. అన్నీ ఖరారయ్యాక సౌందర్యతో మాట్లాడబోతున్నారని తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే భీమినేనికి ఫోన్ చేశారు. దయచేసి సౌందర్యను తీసుకోవద్దు అని విన్నవించుకున్నారు. దీనికి కారణం అప్పటికే సినీ పరిశ్రమలో సౌందర్య స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అంతేకాదు.. వయసులో కూడా పవన్ కన్నా పెద్దది. ఈ రెండింటికన్నా మరోప్రధాన కారణం.. సౌందర్య నటనముందు తాను కొత్తగా వస్తున్న హీరోను కాబట్టి తేలిపోతానేమోనని సంశయించారు.

A missed blockbuster movie in the Pawan Kalyan - Soundarya combination

దేవయానితో చేశారు
ఈ విషయాలన్నీ భీమినేనితో పంచుకోవడంతో తమిళంలో హీరోయిన్ గా అప్పుడే కొనసాగుతోన్న దేవయానిని ఒప్పించారు. సినిమా సూపర్ హిట్ అయింది. తండ్రి రఘువరన్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలన్నీ అద్భుతంగా రావడమేకాదు.. ప్రేక్షకులచేత కంటతడి పెట్టించాయి. అలా పవన్, సౌందర్య కాంబోలో మంచి సినిమా మిస్ అయింది. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ వచ్చే నెలలో పూర్తికానుంది. మార్చి 28వ తేదీన ఈ సినిమా విడుదలవబోతోంది. వీరమల్లు షూటింగ్ పూర్తయిన తర్వాత ఓజీ చేస్తారు. ఇది సెప్టెంబరులో విడుదల కాబోతోంది. దీనికి దర్శకుడు సుజిత్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+