తెలుగులో 1111 రోజులు ఆడిన సినిమా
ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదలవుతుంటే రెండు వారాలు, మూడు వారాలకు మించి ఆడటంలేదు. నిర్మాతలు ఒకేసారి అత్యధిక థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేసుకొని కలెక్షన్లు రాబట్టుకొంటున్నారు. మహా అయితే నెలరోజులు.. అభిమానులు గొడవ చేస్తే 50 రోజుల వరకు లాగిస్తున్నారు. తర్వాత సినిమాలన్నీ ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. కానీ గతంలో ఇలా లేదు. సినిమా విడుదలై 100 రోజులు ఆడిందంటే సూపర్ హిట్ కింద లెక్క.
ఇంకా బాగుందంటే సిల్వర్ జూబ్లీ (175 రోజులు), 365 రోజులు, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అసలు తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభమైన తర్వాత అభిమానుల ఆదరణ దక్కించుకొని తెలుగులో తొలిసారిగా మూడు సంవత్సరాలకు పైగా ఆడిన సినిమా గురించి తెలుసుకుందాం.

శ్రీరామనవమి వచ్చిందంటే ఇవే పాటలు
నందమూరి తారకరామారావు కథానాయకుడిగా 1963లో విడుదలైన లవకుశ చిత్రం 1111 రోజులు ఆడి సంచలన రికార్డును నెలకొల్పింది. ఎన్టీరామారావు, అంజలీదేవి సీతారాములుగా నటించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులకు తమ ఊళ్ల నుంచి పట్టణాలకు ఎడ్లబండ్లు కట్టుకొని వచ్చేవారు. టికెట్లు దొరక్కపోయినా తర్వాత ఆటకైనా సాధించుకొని సినిమా చూసి మరీ ఇంటికెళ్లేవారు. లవకుశలోని పాటలు అజరామరం అని చెప్పొచ్చు. శ్రీరామనవమి వచ్చిందంటే ఈ సినిమా పాటలు లేకుండా పండగ జరగదు. తెలుగులో ఇంతవరకు ఏ సినిమా కూడా 1111 రోజులు ఆడలేదు.
ప్రేక్షకులు హారతులు ఇచ్చేవారు
నందమూరి తారకరామారావు తనయుడైన బాలయ్య సినిమా లెజెండ్ 1105 రోజులు ఆడింది. ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఏకబిగిన 1105 రోజులు ప్రదర్శితమైంది. వాస్తవానికి థియేటర్ యజమాని, బాలయ్య అభిమానులు ఈ సినిమాను ఇంకా ఆడిద్దామని పట్టుపట్టినప్పటికీ తన తండ్రి రికార్డును బద్ధలు కొట్టడం ఇష్టంలేక, సినిమా అత్యధిక రోజులు ఆడిన రికార్డు తన తండ్రి పేరుమీదే ఉండాలని భావించిన బాలయ్య ఒప్పుకోలేదు. తండ్రిపై ఆయనకున్న గౌరవానికి ఇది నిదర్శనం. సి.పుల్లయ్య, ఆయన తనయుడు సి.ఎస్.రావు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రామారావు, అంజలీదేవి నిజమైన సీతారాములే అని భావించిన ప్రేక్షకులు వారికి హారతులు పట్టేవారు.












Click it and Unblock the Notifications