లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మల్టీస్టారర్? ఓకే చెప్పిన హీరోలు!
తమిళంలో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించి, తాను తీసే ప్రతి సినిమాను మరో సినిమాకు ముడిపెడుతూ వస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటోంది. అంతేకాదు.. ఆయన సినిమాలో చివరలో ఒక స్టార్ హీరో ఎంట్రీ ఉంటుంది. సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ఈ క్యామియో పాత్ర మరో ఎత్తు అవుతూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తెస్తోంది. తాజాగా ఈ యువ దర్శకుడు ఓ మల్టీస్టారర్ సినిమా తీయాలని కథ రాసుకున్నారు. దీనికి సంబంధించిన కథను కూడా తాను అనుకున్న ఇద్దరు హీరోలకు వినిపించాడు.
ఎన్టీఆర్ అయితే సినిమా చేస్తానన్న అల్లు అర్జున్
లోకేష్ అనుకున్న హీరోలెవరంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఏ సినిమా చేస్తారో చూడాలి. లోకేష్ కనగరాజ్ వినిపించిన కథ బాగుండటంతో దానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరో పాత్రతోపాటు సమానంగా మరో కీలక పాత్ర కూడా ఉంది. అది కూడా హీరో పాత్రే. అయితే ఈ పాత్రను ఎవరితో చేయించాలనేదానిపై లోకేష్ ఆలోచనలో ఉండిపోయారు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలనే ఆలోచనకు వచ్చారు. అల్లు అర్జున్ కు కథ చెప్పిన తర్వాత ఆ పాత్ర గురించి వీరి మధ్య చర్చ నడిచింది. తాను ఎన్టీఆర్ ను అనుకుంటున్నట్లు లోకేష్ చెప్పారు. అల్లు అర్జున్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చేస్తానంటే ఈ సినిమాను కచ్చితంగా తాను చేస్తానని చెప్పాడు.

ఇది చేస్తే మూడో మల్టీస్టారర్ అవుతుంది
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్, హృతిక్ రోషన్ తో వార్2 లాంటి మల్టీస్టారర్ మూవీస్ చేశాడు. ఇది చేస్తే మూడో మల్టీస్టారర్ అవుతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు చేయాల్సి ఉంది. అయితే లోకేష్ ఇంకా కథను తారక్ కు వినిపించలేదు. కథ వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఎన్టీఆర్ ఓకే చెబితే తాను చేసే సినిమాల వరుస మారే అవకాశం ఉంది. లోకేష్ మాత్రం కథ వినిపించి జూనియర్ ఎన్టీఆర్ తో ఓకే చేయించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం.












Click it and Unblock the Notifications