విడాకుల వరకు వెళ్లిన భూమిక..ఆ హీరో ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్
ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్ భూమికదే హవా. వరుసగా స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మహేష్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఈ ముగ్గురు హీరోలతోనూ భూమిక ఇండస్ట్రీ హిట్లను కొట్టింది. మహేష్ బాబుతో ''ఒక్కడు'', పవన్ కల్యాణ్‌తో ''ఖుషి'', ఎన్టీఆర్‌తో ''సింహాద్రి'' వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్లలో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన కూడా భూమిక నటించారు. అయితే తర్వాత యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో భూమిక క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. అయినప్పటకి ''అనసూయ'' వంటిలేడి ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.
భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా భూమిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే భూమిక యోగ టీచర్ భరత్ ఠాకూర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.అయితే భూమిక తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకోబోతుందనే వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. భరత్ ఠాకూర్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే భూమిక తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుందనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకొని కోర్టులో కేసు కూడా వేద్దామనుకున్నారనే టాక్ కూడా వినిపించింది. కానీ ఈ సమయంలో హీరో నాగార్జున ఎంట్రీ ఇచ్చి వీరి విడాకులకు బ్రేక్ వేశారట.

అక్కినేని నాగార్జునతో స్నేహమంటే ఇదేరా అనే మూవీలో భూమిక నటించింది. అయితే ఈ సినిమాలో నాగార్జునతో భూమికకి మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అలా భూమిక భరత్ ఠాకూర్ విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇంటికి వెళ్లి మరీ భూమిక,భరత్ ఠాగూర్‌ని అడిగి తెలుసుకున్నారట నాగార్జున. అయితే తమపై వచ్చేవన్ని కూడా రూమర్లే అని భూమిక చెప్పడంతో కంగు తినడం నాగార్జున వంతు అయిందట. విడాకుల వార్తల మీద స్పందిస్తే ఆ వార్తలు మరింత ఎక్కువవుతాయనే ఉద్దేశంతో దీన్ని ఖండించడం లేదని నాగార్జనకు వివరించిందట భూమిక. ఈ విషయం బయట పడడంతో భూమిక భరత్ ఠాగూర్ మధ్య విడాకుల వార్తలు కేవలం రూమర్సే అని తేలిపోయాయి.












Click it and Unblock the Notifications