హీరోయిన్ పెదవి రక్తం వచ్చేలా కొరికిన స్టార్ హీరో..హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?
ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.
గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటి తరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్దు సీన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో షూటింగ్‌లో హీరోయిన్ పెదవి కొరికారట. దర్శకుడు కట్ చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా సీన్‌లో లీనమైపోయాడట సదరు హీరో.

ఆ హీరో మరెవరో కాదు వినోద్ ఖన్నా. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు మాధురీ దీక్షిత్.ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ మధ్య జరిగిన ఒక ముద్దు సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 'దయవాన్' సినిమా చిత్రీకరణ సమయంలో ఒక ముద్దు సీన్‌లో వినోద్ ఖన్నా పాత్రలో ఎంతగా లీనమైపోయారంటే, దర్శకుడు "కట్" చెప్పినా కూడా ఆయన ఆగలేదని సమాచారం. వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ పెదవిని గట్టిగా కొరకడంతో ఆమె పెదవి చిట్లి రక్తం కారిందట. ఈ సంఘటనతో సెట్‌లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. నొప్పి తట్టుకోలేక మాధురీ దీక్షిత్ ఏడుస్తూ సెట్ నుండి వెళ్లిపోయారట.
అయితే, ఆ తర్వాత దర్శకుడు ఫిరోజ్ ఖాన్‌తో పాటు వినోద్ ఖన్నా కూడా మాధురీ దీక్షిత్‌కు క్షమాపణలు చెప్పడంతో ఆమె సినిమా షూటింగ్ పూర్తి చేసింది.అయితే సినిమా విడుదలైన తర్వాత, ఆ ముద్దు సన్నివేశంపై పలు వివాదాలు తలెత్తాయి. దీంతో మాధురీ దీక్షిత్ స్వయంగా దర్శకుడు ఫిరోజ్ ఖాన్‌ను కలిసి ఆ సన్నివేశాన్ని తొలగించమని విజ్ఞప్తి చేశారు. కానీ, ఫిరోజ్ ఖాన్ మాత్రం ఈ సన్నివేశమే సినిమాకు హృదయం, ప్రేక్షకులు దీని వల్లే సినిమాకు వస్తారని చెప్పి తొలగించడానికి నిరాకరించారట. ఆ సీన్‌ను సినిమాలో కొనసాగించడం కోసం హీరో, దర్శకుడు కలిసి దాదాపు రూ.1 కోటి వరకు అదనంగా ఖర్చు చేశారని సమాచారం.












Click it and Unblock the Notifications