జూనియర్ ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ రిటర్న్ గిఫ్ట్
తెలుగు సినీ పరిశ్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్టార్ హీరులుగా రాణిస్తున్నారు. తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరో అవగా, అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఏ సందర్భంలో వీరు కలుసుకున్నా లేదంటే ఫోన్ లో మాట్లాడుకునే ఈ ఇద్దరూ ఎంతో ప్రేమతో బావా.. బావా.. అని సంభోదించుకుంటుంటారు. అంతేకాదు.. ఒకరిపట్ల మరొకరు ఎంతో ఆప్యాయతతో, అభిమానంతో వ్యవహరిస్తుంటారు. ఈ ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దేశ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు.
గతంలో అల్లు అర్జున్ దేశముదురు సినిమా విడుదలైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాగా సపోర్ట్ చేశారు. ఇటీవలే అల వైంకుఠపురం సినిమా విడదలైనప్పుడు తారక్ అభిమానులు పిచ్చిపిచ్చిగా సపోర్ట్ చేశారు. దీనికి బదులుగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. పుష్ప సినిమాకు కూడా ఇలాగే జరిగింది. రాబోయే దేవర చిత్రం కోసం తారక్ అభిమానులే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సపోర్ట్ చేయడంద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ అభిమానులు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.

దేవర సినిమాకు అల్లు అర్జున్ అభిమానులు సపోర్ట్ చేయడమే కాకుండా 12న విడుదల కాబోతున్న గుంటూరు కారం సినిమా మీద ట్రోలింగ్ ప్రారంభించారు. దీనికి బదులుగా మహేష్ బాబు అభిమానులు.. తమ హీరోకు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు.. ట్రోలింగ్ మాత్రం చేయవద్దంటున్నారు. కానీ సోషల్ మీడియాలో తాజాగా ఈ ఇద్దరు హీరోల మధ్య మరోసారి వార్ మొదలైంది. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి మరి!.












Click it and Unblock the Notifications