అల్లు అర్జున్ పై నాలుక మడతేసిన అనసూయ
సోషల్ మీడియాలో అనసూయ చురుగ్గా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతుంటుందో, దేన్నిగురించి మాట్లాడుతుంటుందో తెలియదుకానీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది.. ట్రెండింగ్ లో ఉండటానికే ప్రాధాన్యమిస్తుంటుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. వాటిపై వివరణ కూడా ఇచ్చింది అందరిలాగే. తానెప్పుడూ అలా అనలేదని, తనకేం తెలియదని, కావాలనే ఎవరో ఇలా చేశారని చెప్పింది.
అల్లు అర్జున్‌కు జాతీయ పురస్కారం అందించిన చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు సినిమాకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అనసూయ దాక్షాయిణి పాత్రలో కనిపించింది. పుష్ప2లోను నటిస్తోంది. పుష్ప తొలి భాగం గురించి అనసూయ అన్నట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వాటికి అనసూయ స్పష్టత ఇచ్చిందికానీ వైరల్ కావడంమాత్రం తగ్గలేదు.

'పుష్ప: ది రైజ్' సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను అల్లు అర్జున్ తీసుకున్నారని, డ్యాన్స్ మూమెంట్స్‌పై వచ్చిన కామెంట్స్‌ను పరిగణనలోకి తీసుకుని 'పుష్ప: ది రూల్' సినిమాపై మరింత దృష్టి పెట్టారు.. పుష్ప1లో ఉన్న లోపాలు పుష్ప2లో పునరావృతం కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే తన పాత్ర విషయంలో ఆయనకు ఫిర్యాదు వచ్చిందని అనసూయ చెప్పింది. ఇలా ఎందుకు మాట్లాడారు? కారణం ఏమిటి? అనే విషయాన్ని చెప్పాలంటూ పరిశ్రమ వర్గాలతోపాటు నెటిజన్లు కూడా కోరారు.
అయితే ఈ వార్తలను అనసూయ కొట్టేశారు. తాను అంటున్న మాటల్లో ఎటువంటి నిజం లేదన్నారు. తన వ్యాఖ్యలను ఎవరో తారుమారు చేశారంటూ ట్వీట్ చేశారు. అయితే పుష్ప1 గురించి ఆమె ఏం మాట్లాడిందో వాటికి సంబంధించిన వీడియోను ఆమె ట్వీట్ కిందే కొందరు పోస్ట్ చేశారు. అయితే అసలు అనసూయ ఎందుకు అలా మాట్లాడింది? ఇప్పుడు ఎందుకు తాను కాదని చెబుతోంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications