తీవ్ర విషాదంలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. ఏం జరిగిందంటే ?
ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాహుల్ ప్రకటించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో మూడు రోజుల క్రితం నాన్న చనిపోయారని తెలిపారు. మీరు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.. ఆ బాధను మాటల్లో చెప్పలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
అలానే ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని రాహుల్ గుర్తు చేసుకున్నారు. నాన్న కష్టపడి పనిచేసేవారు, నిజాయితీపరులుగా మంచి జీవితాన్ని గడిపారని రాసుకొచ్చారు. మీరూ ఎప్పటికీ మా జ్ఞాపకాలలో సజీవంగా ఉంటారు.. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని తెలిపారు. చి.ల. సౌ సినిమాకు కథ రాస్తున్నప్పుడు ఓ లైన్ రాశాను. అది ఎప్పుడు నా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. నాన్న ఉన్నారు లే, చుస్కుంటారు అనే మాటకి విలువ నాన్నని కొల్పోయిన వాళ్ళకే మాత్రమే తెలుసు.. నాకు అది ఈరోజు అర్థమవుతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ క్రమంలోనే రాహుల్ సన్నిహితులు, పలువురు ప్రముఖులు సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే ప్రతి విషయంపై ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా స్పందించే రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద.. ఇప్పుడు మాత్రం ఎలాంటి పోస్ట్ షేర్ చేయకపోవడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రవీంద్రన్ ప్రస్తుతం రైటర్‌గా, దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుకుంటున్నారు. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్‌కి హీరో పరిచయమైన రాహుల్ ఆ తర్వాత సహాయ నటుడి పాత్రలు, ప్రతి కథానాయకుడి పాత్రలు పోషించారు. 'చిలసౌ' అనే సినిమాతో తనలో ఒక దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా రావడంతో సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లో నాగార్జున నటించిన మన్మథుడు 2 మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రష్మికతో ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా తెరకెక్కిస్తున్నారు రాహుల్.












Click it and Unblock the Notifications