భార్య ఉండగానే లవర్‌ని పెళ్లి చేసుకున్న హీరో.. ఆమె 6 నెలల గర్భవతి కూడా !
వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజమే. అయితే నేటి కాలంలో మాత్రం కారణం చిన్నదైనా కానీ విడపోవడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక సినిమా రంగంలో అయితే ఈ తంతు షరా మామూలే. ఇద్దరికీ సెట్ అవ్వట్లేదని ఇలా ఏదో ఒక కారణం చెబుతూ సెలబ్రిటీలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కొందరు నటీనటులు మాత్రం విడాకులు తీసుకోకుండానే తమ ప్రియురాళ్లతో కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. తాజాగా తమిళ హీరో మదంపట్టి రంగరాజ్ చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.
ప్రొఫెషనల్ చెఫ్‌గా గుర్తింపు పొందిన మదంపట్టి రంగరాజ్.. తమిళనాడులో కుకింగ్ రియాలిటీ షోస్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. తర్వాత సినిమాలపై ఆసక్తితో 'మొహందీ సర్కస్' సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. రంగరాజ్ శృతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినట్టు, విడాకులు తీసుకుంటున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ వాటిపై రంగరాజ్ ఎప్పుడూ స్పందించలేదు.
అయితే ఈలోపు, రంగరాజ్ కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డాతో సన్నిహితంగా ఉంటున్నాడనే గాసిప్స్ సోషల్ మీడియాలో షికారు చేశాయి. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని కూడా టాక్ నడిచింది. కానీ రంగరాజ్ ఈ విషయాలపై నోరు మూసుకున్నాడు. తాజాగా అన్ని గాసిప్స్ నిజమయ్యేలా రంగరాజ్ ప్రియురాలితో గుడిలో సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి ఫోటోలను జాయ్ క్రిసిల్డా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది.
6 నెలల గర్భంతో జాయ్..
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన జాయ్, ''2025లో బేబీ లోడింగ్. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం. నేను 6 నెలల గర్భంతో ఉన్నాను'' అంటూ పోస్ట్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్కసారిగా రంగరాజ్ వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ అయిపోయింది.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొందరు మాత్రం ''మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇలా రెండో పెళ్లి ఎలా?'' అంటూ విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications