షారుఖ్ ఖాన్‌కు ఏమైంది?

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అనారోగ్యం పాలయ్యారు. డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఐపీఎల్ 2024 ఫైనల్స్ కోసం ఆయన ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటోన్నారు. అక్కడే వడదెబ్బ తగిలింది. ఫలితంగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

షారుఖ్ ఖాన్‌కు చెందిన ఐపీఎల్ టీమ్ కోల్‌కత నైట్ రైడర్స్. ఈ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో విజయఢంకా మోగించింది. ఫైనల్స్‌లో అడుగు పెట్టింది.

Actor Shah Rukh Khan admitted to hospital in Ahmedabad

ఈ మ్యాచ్ చూడటానికి మధ్యాహ్నం నుంచీ షారుఖ్ ఖాన్ స్టేడియంలోనే గడిపారు. రాత్రి మ్యాచ్ ముగిసేంత వరకూ ఫ్యాన్స్‌తో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. మ్యాచ్ గెలిచిన తరువాత కూడా అర్ధరాత్రి దాటేంత వరకూ తన సన్నిహితులతో పార్టీ ఇస్తూ గడిపినట్లు తెలుస్తోంది.

ఈ ఉదయం నుంచి కూడా ఆయన పెద్దగా బయటికి రాలేదు. హోటల్ గదిలోనే గడిపారు. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల షారుఖ్ ఖాన్ అస్వస్థత పాలయ్యారు. డీహైడ్రేషన్‌కు గురయ్యారు. శరీరంలో నీటి శాతం గణనీయంగా తగ్గడం వల్ల ఒక దశలో సొమ్మసిల్లిన స్థితిలో కనిపించినట్లు చెబుతున్నారు.

Actor Shah Rukh Khan admitted to hospital in Ahmedabad

దీనితో ఆయనను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోల్‌కత నైట్‌రైడర్స్ కో ఓనర్, ప్రముఖ నటి జుహీచావ్లా, ఆమె భర్త జై మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+