ఒకప్పటి "రొమాంటిక్ హీరో" సినిమాలకు అందుకే గుడ్ బై చెప్పారా..?

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న రొమాంటిక్ హీరో... సైలెంట్‌గా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయారు. ఆయన "ఎక్కడ ఉన్నారు?" అనే ప్రశ్నకు సంవత్సరాల పాటు సమాధానం దొరకకపోవడం గమనార్హం. ఆయనే Vadde Naveen. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం, అభిమానుల్లో ఓ మధురమైన నోస్టాల్జియాను మేల్కొలిపింది. దీంతో ఒకప్పటి ఆ "రొమాంటిక్ హీరో" సినిమాలకు సడన్‌గా ఎందుకు గుడ్ బై చెప్పారని జోరుగా చర్చ నడుస్తోంది.

నవీన్ కెరీర్..

1990ల చివరలో టాలీవుడ్‌లో కొత్త తరహా ప్రేమ కథలకు కొత్త ముఖం ఇచ్చిన హీరోగా నవీన్ పేరు తెచ్చుకున్నారు. Pelli వంటి బ్లాక్‌బస్టర్‌తో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకుని.. Manasichi Choodu, Korukunna Priyudu వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఆయన సహజ నటన, సింప్లిసిటీ.. రెండూ కలిసి ఆయనను ఫ్యామిలీ హీరోగా నిలబెట్టాయి. అయితే కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే ఆయన మెల్లగా వెనక్కి తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

actor-vadde-naveen-opens-about-his-retiremet-from-movies-and-acting-goes-viral-on-social-media

ఆ తర్వాత ఆయన నటించిన కొత్త సినిమాలు రావడం ఆగిపోయింది... ఇంటర్వ్యూలు కనిపించలేదు... కాలక్రమేణా సోషల్ మీడియాలో ఒక్కటే ప్రశ్న వినిపించింది-"వడ్డే నవీన్ ఏమయ్యారు?" ఈ ప్రశ్నకు చాలా కాలం తర్వాత ఆయనే సమాధానం చెప్పారు. "మంచి కథ ఉంటేనే చేస్తా... లేకపోతే చేయను" అని కుండబద్దలు కొట్టారు. ట్రెండ్ కోసం, ఒత్తిడి కోసం సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

అయితే సినిమాలకు దూరంగా ఉన్న కాలంలోనే నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. 'వడ్డే క్రియేషన్స్' పేరుతో బ్యానర్ స్థాపించి Transfer Trimurtulu వంటి ప్రాజెక్ట్‌ను నిర్మించడం ద్వారా, ఇండస్ట్రీతో తన అనుబంధాన్ని కొనసాగించారు. ఇటీవల ఆయన మళ్లీ మీడియా ముందుకు రావడం, కొన్ని టీవీ ప్రోగ్రామ్‌లలో కనిపించడం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. ఒకప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగిన ప్రేక్షకులు, ఇప్పుడు అదే హీరోను మళ్లీ చూడాలని ఆశపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+